శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ గురించి వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3కి తర్వాతి వెర్షన్‌గా గెలాక్సీ జెడ్ ఫోల్ట్ 4 పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందిస్తుంది. ఈ ఫోన్ గతంలో వచ్చిన ఫోల్డబుల్ కంటే అత్యంత పవర్‌ఫుల్‌గా, మెరుగైన డిజైన్‌తో రానుంది.


ఈ ఫోన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రివీల్ చేశాడు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4లో 7.6 అంగుళాల క్యూఎక్స్‌జీఏ+ ఇన్నర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.


ఇక బయటవైపు 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ అవుటర్ డిస్‌ప్లేను అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది.


512 జీబీ వరకు స్టోరేజ్, ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ టెలిఫొటో సెన్సార్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో ఉన్న సెన్సార్ కంటే బెటర్‌గా ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ లోపల భాగంలో ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


బయట భాగంలో ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కాబట్టి మీరు సెల్ఫీలు తీసుకోవాలనుకున్నప్పుడు ఫోన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్ కాగా... 25W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!