శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ అందించారు. అంటే మొదటి సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోతే రెండో సిమ్ సిగ్నల్ ద్వారా మొదటి సిమ్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చన్న మాట. అంటే మీ ఫోన్‌లో ఒక సిమ్‌కు సిగ్నల్ లేకపోయినా రెండో సిమ్ నెట్‌వర్క్‌తో కాల్స్ చేసుకోవచ్చన్న మాట.


శాంసంగ్ గెలాక్సీ ఎం13 ధర
శాంసంగ్ గెలాక్సీ ఎం13 రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  రూ.11,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్, అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో జులై 23వ తేదీ నుంచి శాంసంగ్ ఎం13 సేల్ జరగనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. అంటే బేస్ వేరియంట్ రూ.10,999కే కొనేయచ్చన్న మాట.


శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ ఎం13 పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 480 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.


128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చన్న మాట. శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం13 పని చేయనుంది. దీని మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 207 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ సూట్ కూడా ఈ ఫోన్‌తో పాటు రానుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!