శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ, గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్లు మనదేశంలో జులై 14వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ స్మార్ట్ ఫోన్ 12 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ వేరియంట్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. జులై 14వ తేదీ మధ్యాహ్నం 12వ తేదీన శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ, గెలాక్సీ ఎం13 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన మైక్రో సైట్ కూడా చూడవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ, గెలాక్సీ ఎం13 4జీ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ప్రీ-లాంచ్ మైక్రోసైట్ అమెజాన్‌లో చూడవచ్చు. శాంసంగ్ దీని 5జీ మోడల్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీలో ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా ఉండనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్ డెలివరీ చేయనుంది. ప్రైమరీ సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా కనెక్ట్ అయి ఉండటానికి ఉపయోగపడే ఆటో డేటా స్విచింగ్ ఫీచర్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనుంది.


సిల్వర్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించనున్నారు. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లే అందించనున్నారు. శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. 4జీ మోడల్‌లో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉండనుంది.


ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం సిల్వర్, బ్లాక్, బ్రౌన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ రెండు ఫోన్లు బడ్జెట్ ధరలోనే ఉండనున్నాయి. వీటి ఫీచర్లను బట్టి రూ.20 వేలలోపే దీని ధర ఉండనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!