షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 11 సిరీస్‌ను ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఇప్పుడు దీనికి తర్వాత వెర్షన్ కూడా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతుంది. అదే రెడ్‌మీ నోట్ 12 సిరీస్. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లా కాకుండా రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అందించనున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో కూడా ఈ ఫోన్లే ఉండే అవకాశం ఉంది.


రెడ్‌మీ నోట్ 12కు పెద్ద అప్‌గ్రేడ్
రెడ్‌మీ నోట్ 12 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌పై పని చేయనుందని ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీతో సమానంగా ఈ కొత్త ప్రాసెసర్ పని చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది. రియల్‌మీ 10 సిరీస్ ఫోన్లతో ఈ ఫోన్ పోటీ పడనుంది.


రెడ్‌మీ నోట్ 12లో అప్‌గ్రేడ్ చేసిన 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి. ఈ ప్రాసెసర్ 4కేను సపోర్ట్ చేస్తుంది కాబట్టి 4కే వీడియో షూటింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది.


రెడ్‌మీ నోట్ 12తో పాటు రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. ఈ రెండిట్లో 6.6 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్‌డీ+ సపోర్ట్ ఉండనున్నాయి. రెడ్‌మీ నోట్ 12లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్‌లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీలు అందించనున్నారు. ప్రో ప్లస్ వేరియంట్‌లో చార్జింగ్ వేగం ఎక్కువగా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లు 2023 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?