Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ మనదేశంలో లాంచ్ చేసిన రెడ్‌మీ కే50ఐ 5జీపై భారీ డిస్కౌంట్ అందించింది.

Continues below advertisement

Redmi K50i 5G Discount: రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో భారీ ఆఫర్ అందించారు. రూ.25,999 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై ఏకంగా రూ. ఏడు వేల ధర తగ్గింపును అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 144 హెర్ట్జ్ డిస్‌ప్లే, వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై రెడ్‌మీ కే50ఐ 5జీ పనిచేయనుంది.

Continues below advertisement

రెడ్‌మీ కే50ఐ 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, ఇది రూ.18,999కే లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు అందించే డిస్కౌంట్‌తో కలిపితే రూ.18,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చని రెడ్‌మీ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఎంతగా ఉండనుందో తెలియరాలేదు. క్విక్ సిల్వర్, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ కే50ఐ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్ సర్టిఫికేషన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 144 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఇందులో అందించారు. టచ్ శాంప్లింగ్ రేట్ 270 హెర్ట్జ్‌గా ఉంది.

8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5080 ఎంఏహెచ్‌గా ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఐపీ53 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఇందులో ఉంది.

Read Also: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!

Continues below advertisement
Sponsored Links by Taboola