రెడ్‌మీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే కే50 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్‌గా రెడ్‌మీ కే50 అల్ట్రాను స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇందులో 2కే రిజల్యూషన్ ఉన్న ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ అందించనున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం సెకండాఫ్‌లో రెడ్‌మీ కే50 అల్ట్రా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మీ ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (విబో ఐడీ) దీని గురించి వివరాలను ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్, 100W ఫాస్ట్ చార్జింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.
రెడ్‌మీ కే50 ప్రోలో 6.67 అంగుళాల 2కే రిజల్యూషన్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఏకంగా 1200 నిట్స్ మ్యాగ్జిమం బ్రైట్‌నెస్ ఈ ఫోన్‌లో ఉండటం విశేషం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉండనుంది. 4 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫోన్ వెనకవైపు 100 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. రెడ్‌మీ కే50 అల్ట్రా లాంచ్ కానుందో లేదో కంపెనీ అధికారికంగా తెలపలేదు. ఒకవేళ లాంచ్ అయితే ఇది హైఎండ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ కానుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!