రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ మనదేశంలో టీజ్ చేసింది. ‘Diwali With Mi' ట్యాగ్‌లైన్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేసింది కాబట్టి దీపావళికి ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రెడ్‌మీ ఏ1 పలు బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్లలో కూడా కనిపించింది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. రెడ్‌మీ ఏ1కు ఐస్ అని కోడ్ నేమ్ పెట్టారు.
ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్లో కూడా ఇటీవలే కనిపించింది. ఏ1 ఆల్ రౌండర్స్ అని కంపెనీ తన ట్వీట్‌లో టీజ్ చేసింది. కాబట్టి ఏ1 అనేది సరికొత్త మొబైల్ సిరీస్ అనుకోవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ప్రాసెసర్‌ను బట్టి చూస్తే రెడ్‌మీ ఏ1 ధర రూ.10 వేలలోపు ఉండనుంది.
రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను షావోమీ సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేయనుంది. రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. యూఎస్ ఎఫ్‌సీసీ డేటా బేస్‌లో కూడా ఈ ఫోన్ చూడవచ్చు. 220733SL మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
గతంలో ఎంఐలో ఏ-సిరీస్ ఫోన్లు వచ్చేవి. ఎంఐ ఏ1, ఎంఐ ఏ2, ఎంఐ ఏ3 స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. స్టాక్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఆ ప్రయోగం వికటించడంతో ఆ సిరీస్‌ను కంపెనీ నిలిపివేసింది.
రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈలో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!