రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. అదే రెడ్‌మీ ఏ1 ప్లస్. అక్టోబర్ 14వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు షావోమీ అధికారికంగా ప్రకటించింది. దీని స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను కంపెనీ యూట్యూబ్ చానెల్, ఇతర సోషల్ మీడియా చానెళ్లలో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.
రెడ్‌మీ ఏ1 ప్లస్ స్పెసిపికేషన్లు (అంచనా)
షావోమీ అధికారిక వెబ్‌సైట్లో ఉన్న మైక్రోసైట్ ప్రకారం... బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. దీంతోపాటు వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే కూడా ఉండనుంది.6.52 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకవైపు ఉంది.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లు అందించనున్నారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 64 జీబీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.
రెడ్‌మీ ఏ1 ప్లస్ ధర (అంచనా)
రెడ్‌మీ ఏ1 ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దీని ధర రూ.10 వేలలోపే ఉండనుంది. మైస్మార్ట్ ప్రైస్ కథనం ప్రకారం దీని ధర రూ.6,499 నుంచి రూ.7,499 మధ్య ఉండనుంది. రెడ్‌మీ ఏ1 మనదేశంలో రూ.6,499 ధరతో లాంచ్ అయింది. టెక్నో పాప్ సిరీస్, ఇన్‌ఫీనిక్స్ హాట్ సిరీస్‌లోని ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లతో రెడ్‌మీ ఏ1 ప్లస్ పోటీ పడనుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?