రెడ్‌మీ 12 5జీ మనదేశంలో ఆగస్టు 1వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు రెడ్‌మీ 12 4జీ కూడా లాంచ్ కానుంది. రెడ్‌మీ 12 4జీ ఇప్పటికే పలు మార్కెట్లలో లాంచ్ అయింది. రెడ్‌మీ 12 5జీలో భారీ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అందించనున్నారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


రెడ్‌మీ ఇండియా అధికారిక అకౌంట్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన డిజైన్, ఇతర కీలక స్పెసిఫికేషన్లు కూడా టీజ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీ కూడా క్రియేట్ చేశారు. హోల్ పంచ్ కటౌట్ ఉన్న కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ వెనకవైపు డ్యూయల్ కెమెరా యూనిట్ చూడవచ్చు. రెడ్‌మీ ఫోన్‌లో అతి పెద్ద బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.


రెడ్‌మీ 12 5జీ స్మార్ట్ ఫోన్ మాన్‌సూన్ షేడ్‌తో రానుందని సమాచారం. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 16 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి.


చైనాలో గత నెలలో లాంచ్ అయిన రెడ్‌మీ 12ఆర్ స్మార్ట్ ఫోన్‌నే రెడ్‌మీ 12 5జీగా మనదేశంలో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ చైనాలో 999 యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.11,300) ధరతో లాంచ్ అయింది. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉండనుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. రెడ్‌మీ 12 4జీ స్మార్ట్ ఫోన్ యూరోప్‌లో 199 యూరోల ధరతో (మనదేశ కరెన్సీలో సుమారు రూ.17,000) లాంచ్ అయింది. మనదేశంలో ఇంత కంటే తక్కువ ధరతోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.














Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial