రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ కానుంది. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ ఫోన్ కూడా లాంచ్ కానుంది. అంటే రెడ్‌మీ 11 ప్రైమ్‌లో 5జీ, 4జీ వేరియంట్లు కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయన్న మాట. అమెజాన్‌లో ఈ ఫోన్ సేల్‌కు వెళ్లనుంది. దీనికి సంబంధించిన లైవ్ పేజీని కూడా అమెజాన్‌లో చూడవచ్చు.


రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ
రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.


ఇందులో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించనున్నారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. బ్లాక్, మింట్ గ్రీన్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీలో టియర్ డ్రాప్ తరహా డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.


వీటితో పాటు రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉండనుంది. కానీ ప్రాసెసర్ పేరు మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ద్వారా ‘క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్’ అందించనుందని షావోమీ ప్రకటించింది. అంటే ఎటువంటి యూజర్ ఇంటర్ ఫేస్ లేకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో రెడ్‌మీ ఏ1 లాంచ్ కానుందన్న మాట.


సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన లాండింగ్ పేజ్ కూడా కంపెనీ వెబ్‌సైట్లో చూడవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. కనీసం మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో ఎంఐ ఏ-సిరీస్‌లో ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు రెడ్‌మీ ఏ-సిరీస్‌లో వస్తున్నాయి.


రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ మోడల్ ధరను రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ పని చేయనుంది. 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌‌ను రెడ్‌మీ నోట్ 11ఎస్ఈలో అందించారు . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!