రియల్‌మీ జీటీ నియో 3టీ మనదేశంలో లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రియల్‌మీ జీటీ సిరీస్‌లో హైఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఈ సిరీస్‌తో లాంచ్ అవుతాయి. రియల్‌మీ జీటీ నియో 3టీ గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ టీజ్ చేసింది. కాబట్టి త్వరలో మనదేశంలో కూడా కచ్చితంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


రియల్‌మీ తన ట్వీటర్ పోస్టు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేసింది. దీని లాంచ్ తేదీని ప్రకటించలేదు. గతేడాది చైనాలో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ నియో 2టీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. రియల్‌మీ జీటీ నియో 3టీ మనదేశంలో జూన్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. ఈ ఫోన్ ఎన్టీబీసీ, బీఐఎస్, 3సీ సర్టిఫికేషన్ సైట్లలో కూడా ఈ ఫోన్ కనిపించింది.


RMX3371 అనే మోడల్ నంబర్‌తో గీక్ బెంచ్ టెస్టింగ్ వెబ్ సైట్లో కూడా రియల్‌మీ జీటీ నియో 3టీ కనిపించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 1003 పాయింట్లను, మల్టీకోర్ టెస్టింగ్‌లో 2607 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది.


రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను రియల్‌మీ ఇందులో అందించనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనున్నాయి.


ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 80W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!