రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో గతంలోనే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. రియల్‌మీ సీఈవో మాధవ్ సేథ్ యూట్యూబ్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ‘ఆస్క్‌మాధవ్’ ఎపిసోడ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


దీనికి సంబంధించిన సపోర్ట్ పేజ్ కూడా గతంలోనే ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ ఫోన్ మనదేశంలో గతంలోనే లాంచ్ కానుందని వార్తలు వచ్చాయి కానీ కంపెనీ దీన్ని తీసుకురాలేదు. ఈసారి సీఈవోనే డైరెక్ట్‌గా చెప్పారు కాబట్టి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుందని కథనాలు వస్తున్నాయి. డ్యాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గానూ ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 80 పర్సెంట్ చార్జింగ్ అవ్వడానికి కేవలం 12 నిమిషాలు మాత్రమే పట్టనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


రియల్‌మీ జీటీ నియో 3లో నరుటో ఎడిషన్, థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్‌లను కంపెనీ గత నెలలో లాంచ్ చేసింది. బాగా ఫేమస్ అయిన నరుటో గేమ్ థీమ్‌తో నరుటో ఎడిషన్‌ను, థోర్ లవ్ అండ్ థండర్ సినిమా విడుదల సందర్భంగా మార్వెల్ స్టూడియోస్ భాగస్వామ్యంతో  థోర్: లవ్ అండ్ థండర్ ఎడిషన్‌ను కంపెనీ రియల్‌మీ మనదేశంలోకి తీసుకువచ్చింది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!