రియల్‌మీ 10 లాంచ్‌కు దగ్గర పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించింది. గతంలో వచ్చిన కథనాల ప్రకారం... ఈ ఫోన్ RMX3630 మోడల్ నంబర్‌తో లాంచ్ కానుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్లో కూడా రియల్‌మీ 10 కనిపించింది. ఈ ఫోన్ సీబీ టెస్ట్ సర్టిఫికేషన్ కూడా పొందింది.


గీక్ బెంచ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కూడా ఈ ఫోన్ కనిపించింది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. రియల్‌మీ 10లో ఇది 4జీ వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. రియల్‌మీ 9లో కూడా కంపెనీ 4జీ, 5జీ వేరియంట్లను లాంచ్ చేసింది. 8 జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం ఈ ఫోన్‌లో ఉండే అవకాశం ఉంది.


గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం రియల్‌మీ 10 సింగిల్ కోర్ టెస్టులో 483 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1,688 పాయింట్లను సాధించింది. దీని స్పెసిఫికేషన్ల గురించి ఈ లిస్టింగ్‌లో ఎక్కువ వివరాలు తెలియరాలేదు. ఈ ఫోన్ ఇండియా, థాయ్‌ల్యాండ్, మలేషియా, ఇండోనేషియాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


దీని ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండనుంది. లాంచ్ సమయానికి దీన్ని 5000 ఎంఏహెచ్‌కు పెంచే అవకాశం ఉంది. దీని ముందు వెర్షన్ రియల్‌మీ 9 4జీ కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతోనే లాంచ్ అయింది.


రియల్‌మీ 9 4జీ స్పెసిఫికేషన్లు చూస్తే... ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 33W డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది.


ఇక ధర విషయానికి వస్తే... ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. మీటియోర్ బ్లాక్, స్టార్‌గేజ్ వైట్, సన్‌బర్స్ట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?