iPadOS 26: కొత్త అప్‌డేట్స్‌తో Apple iPadOS 26ను విడుదల చేసింది యాపిల్ సంస్థ. ఇది iPad పనితీరు, డిజైన్‌లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇది   వినియోగదారుల అనుభవంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అతిపెద్ద అప్‌డేట్‌తో iPadOS వచ్చేసింది.. ఈ కొత్త వెర్షన్ అద్భుతమైన కొత్త డిజైన్, పవర్‌ఫుల్‌ విండోయింగ్ సిస్టమ్, Apple Intelligence  టూల్స్,  ఫైల్ నిర్వహణ  ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

కొత్త డిజైన్, కొత్త అనుభవం

iPadOS 26లో ‘Liquid Glass’ అనే కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ ప్రవేశపెట్టింది. ఇది లాక్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్,  హోమ్ స్క్రీన్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మారుస్తోంది.  యాప్ చిహ్నాలు ఇప్పుడు లైట్  డార్క్ మోడ్‌లకు అనుగుణంగా కనిపిస్తాయి. UI మునుపటి కంటే  క్లీన్‌గా ఉంటుంది. 

 పవర్‌ఫుల్ విండోయింగ్ నిర్వహణ వ్యవస్థ

కొత్త విండోయింగ్ సిస్టమ్ ఇప్పుడు వినియోగదారులకు  పలు విండోలు ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు.  మీరు ఇప్పుడు విండోను మాన్యువల్‌గా రీసైజ్ చేయవచ్చు, టైల్ వ్యూలో అమర్చవచ్చు. Exposé ఫీచర్ ద్వారా ఓపెన్ చేసిన విండోలను ఒకేసారి చూడవచ్చు.  స్టేజ్ మేనేజర్,  అవుటర్ డిస్‌ప్లే సపోర్ట్‌తో మల్టీ టాస్కింగ్ రెట్టింపు అవుతుంది. 

Apple Intelligence సూపర్ అప్‌డేట్

iPadOS 26లో Apple Intelligence మరింత అప్‌డేట్ అయింది.  ఇప్పుడు ఇది లైవ్ ట్రాన్స్‌లేషన్, జెన్‌మోజీ సపోర్టివ్‌గా ఉంటుంది.  ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి టూల్స్‌ కలిగి ఉంది. షార్ట్‌కట్‌లలో ఇంటెలిజెంట్ యాక్షన్స్, టెక్స్ట్ సమ్మరీ,  ఆటో ఇమేజ్ క్రియేషన్ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి.

ఫైల్ నిర్వహణ, డాక్‌లో ఫోల్డర్‌లు

Files యాప్ ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌గా మారింది, రీసైజబుల్ కాలమ్‌లు, ఫోల్డర్ అనుకూలీకరణ (రంగు, ఎమోజీ, చిహ్నం), డాక్‌లో ఫోల్డర్‌లను జోడించే సౌలభ్యంతో ఫైల్‌లను యాక్సెస్ చేయడం మరింత సులభం అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఫైల్ ఫార్మాట్ కోసం డిఫాల్ట్ యాప్‌ను సెట్ చేయవచ్చు.

iPadలో మొదటిసారిగా ప్రివ్యూ యాప్

ఇప్పుడు iPadలో macOSలోని ప్రివ్యూ యాప్ కూడా ఉంది, దీనితో మీరు Apple పెన్సిల్‌తో PDFలను సులభంగా మార్క్అప్ చేయవచ్చు, ఆటోఫిల్ ద్వారా ఫారమ్‌లను పూరించవచ్చు ,ఇమేజ్ ఎడిటింగ్ కూడా చేయవచ్చు.

ఆడియో-వీడియో ఫీచర్లు

iPadOS 26లో ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లు, ఆడియో ఇన్‌పుట్ సెలెక్షన్, వాయిస్ ఐసోలేషన్ , లోకల్ క్యాప్చర్ వంటి టూల్స్ యాడ్ చేశారు. దీనివల్ల కంటెంట్ సృష్టికర్తలకు ఎక్కువ నాణ్యమైన రికార్డింగ్‌లు, మెరుగైన వర్క్‌ఫ్లో అనుభవం లభిస్తుంది.

Journal యాప్ ఇప్పుడు iPadలో కూడా అందుబాటులో ఉంది, దీనిలో వినియోగదారులు Apple పెన్సిల్‌తో డైరీ రాయవచ్చు .ఫోటోలు, వాటికి ఆడియోను జోడించవచ్చు. అదే సమయంలో, Apple Games యాప్, గేమ్ ఓవర్లేతో గేమింగ్ అనుభవం మునుపటి కంటే మరింత కొత్త అనుభూతినిస్తుంది. 

  • Notes యాప్‌లో మార్క్‌డౌన్  ఇంపోర్ట్ 
  • కాలిక్యులేటర్‌లో 3D గ్రాఫింగ్
  • యాక్సెసిబిలిటీ రీడర్ , బ్రెయిలీ యాక్సెస్ వంటి ఫీచర్లు
  • కొత్త రీడ్ పెన్ స్టైల్ Apple పెన్సిల్ కోసం