OnePlus Nord CE 4 India Launch: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయడానికి వన్‌ప్లస్ ముహూర్తం ఫిక్స్ చేసింది. దీంతోపాటు ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 పని చేయనుంది. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 గురించి కంపెనీ ఎక్స్/ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోన్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ వివరాలను వన్‌ప్లస్ రివీల్ చేసింది. గేమ్స్, మీమ్స్, మెమొరీస్, వీటన్నిటినీ స్టోర్ చేసుకోవడానికి 1 టీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చని పోస్ట్ చేసింది. 8 జీబీ వరకు ర్యామ్ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది. వర్చువల్‌గా దీన్ని మరో 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా 256 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. దీని బేస్ వేరియంట్‌లో 128 జీబీ ఉండనుంది. దీంతోపాటు 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందించనున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు కూడా ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4కు సంబంధించిన మైక్రో సైట్‌ను కూడా కంపెనీ పబ్లిష్ చేసింది. ఇందులో ఫోన్ డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. ఈ వెబ్ పేజీ ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 మొబైల్‌ను కెలాడోన్ మార్బుల్, డార్క్ క్రోమ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వెనకవైపు పిల్ ఆకారపు మాడ్యూల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్‌ను కూడా అందించారు.


గతంలో వచ్చిన కథనాల ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4లో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 సపోర్ట్ చేయనుందట.


మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ ధరను ఇటీవలే మనదేశంలో భారీగా తగ్గించారు. 2023 జులైలో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ బడ్జెట్ నార్డ్ సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ నార్డ్ 3 పని చేయనుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించడం విశేషం. ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను లాంచ్ అయినప్పుడు రూ.33,999గా ఉండగా... ఇప్పుడ రూ.29,999కు వచ్చింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 నుంచి రూ.33,999కు వచ్చింది.


Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?