OnePlus New Phone: వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. వన్‌ప్లస్ ఏస్ 3కి సంబంధించి ఇప్పటికే పలు లీకులు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఉండనుందని తెలుస్తోంది. 1.5కే కర్వ్‌డ్ డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌లో ఉండనుందని సమాచారం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ ర్యామ్ వరకు వన్‌ప్లస్ ఏస్ 3లో అందించనున్నారని టెక్ నిపుణులు అంటున్నారు. చైనా కాకుండా ఇతర ప్రపంచ మార్కెట్లలో వన్‌ప్లస్ 12ఆర్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
డిజిటల్ ఛాట్ స్టేషన్ అనే యూజర్ నేమ్ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ ఈ స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఈ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం ఇందులో 1.5కే రిజల్యూషన్ ఉన్న కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉండనుంది. మెటల్ మిడిల్ ఫ్రేమ్, గన్‌మెటల్ గ్రే గ్లాస్ బాడీలతో ఫోన్ బిల్డ్ చేయనున్నట్లు సమాచారం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఉండనుంది.
వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ ఇటీవలే గీక్‌బెంచ్ అధికారిక వెబ్ సైట్లో కనిపించింది. పీజేడీ110 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ టెస్టింగ్‌కు వచ్చింది. సింగిల్ కోర్ టెస్టులో 1,597 పాయింట్లను, మల్టీ కోర్ టెస్టులో 5,304 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది. లిస్టింగ్ ప్రకారం... ‘కలామా’ అనే కోడ్‌నేమ్‌తో ఈ ప్రాసెసర్‌ను లిస్ట్ చేశారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌కు కూడా ఇదే కోడ్‌నేమ్ ఇచ్చారు. 16 జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... వన్‌ప్లస్ ఏస్ 3లో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న ప్రధాన కెమెరా అందించనున్నారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
గ్లోబల్ మార్కెట్లలో వన్‌ప్లస్ 12ఆర్ పేరుతో వన్‌ప్లస్ ఏస్ 3 లాంచ్ కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రూ.39,999 ధరతో లాంచ్ అయింది. ఇది 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర.
మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో ఛాట్ బ్యాకప్ కోసం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కోటాను ఎండ్ చేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మీరు వాట్సాప్‌లో ఎంత డేటానైనా బ్యాకప్ చేయవచ్చు. అయితే త్వరలో కంపెనీ దానిని 15 జీబీకి పరిమితం చేయబోతోంది. అంటే మీకు మీ గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీ ఉంటుందో అంత డేటాను మాత్రమే వాట్సాప్ బ్యాకప్ చేయగలరన్న మాట. ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ స్టోరేజ్ లెక్కలోకి తీసుకునేది కాదు. కానీ ఇక ముందు అలా ఉండబోదు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!