వన్‌ప్లస్ 10 సిరీస్ ఫోన్లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. అయితే దీని తర్వాతి వెర్షన్ వన్‌ప్లస్ 11ను త్వరలో లాంచ్ చేయనుంది. తాజాగా వస్తున్న కథనం ప్రకారం వన్‌ప్లస్ 11 త్వరలో లాంచ్ కానుంది. అయితే విచిత్రం ఏంటంటే ఇంతవరకు వన్‌ప్లస్ 10 స్మార్ట్ ఫోన్ లాంచ్ కాలేదు. వన్‌ప్లస్ 10 ప్రో, వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చాయి.


ప్రముఖ టిప్‌స్టర్ చైనీస్ సోషల్ మీడియాలో దీన్ని టీజ్ చేశారు. దీన్ని బట్టి వన్‌ప్లస్ 11 స్మార్ట్ ఫోన్ రౌండ్ కెమెరా ఐల్యాండ్‌తో రానుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో హాజిల్‌బ్లాడ్ బ్రాండెడ్ కెమెరాలను అందించారు. దీనికి ‘PHB110’ అనే మోడల్ నంబర్ ఇచ్చారు. 


వన్‌ప్లస్ 11 లీక్డ్ స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 11 ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. ఇందులో 6.7 అంగుళాల కర్వ్‌డ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించనున్నారు. 2కే సామర్థ్యమున్న ఎల్టీపీవో ప్యానెల్ ఉండనుంది. ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్‌ను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీని ఫ్రేమ్‌ను మెటల్‌తో రూపొందించనున్నారు. అలెర్ట్ స్లైడర్‌ను కూడా అందించనున్నారు.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ప్రాసెసర్‌ను డిసెంబర్‌లో లాంచ్ చేయనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించనున్నారు. ఇవి సోనీ సెన్సార్లు అయ్యే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ 11 స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 2500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న రెండు బ్యాటరీలు అందించనున్నారు. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.


వన్‌ప్లస్ 10ఆర్ 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా... స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం 2.5డీ కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా వన్‌ప్లస్ 10ఆర్‌లో అందించారు.


4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న ఆప్షన్,  5000 ఎంఏహెచ్, 150W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న ఆప్షన్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10ఆర్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కే3పీ9 సెన్సార్‌ను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా వన్‌ప్లస్ 10ఆర్‌లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 186 గ్రాములుగా ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?