వన్‌ప్లస్ 10 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా రానున్న వన్‌ప్లస్ 11 ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 11 మార్కెట్లో ఐకూ 11తో పోటీ పడనుంది. వన్‌ప్లస్ 11లో 2కే రిజల్యూషన్ ఉన్న కర్వ్‌డ్ డిస్‌ప్లే అందించనున్నట్లు సమాచారం. ఐకూ 11లో కూడా ఇదే డిస్‌ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లలోనూ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అందించనున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్‌లను ఈ ఫోన్లు సపోర్ట్ చేయనున్నాయి.


వన్‌ప్లస్ 11లో కర్వ్‌డ్ డిస్‌ప్లే, ఐకూ 11లో ఫ్లాట్ డిస్‌ప్లే ఉండనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 11లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 48 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి. ఐకూ 11లో మాత్రం 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది.


తాజా లీకుల ప్రకారం వన్‌ప్లస్ 11లో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. వన్‌ప్లస్ 10 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా రానున్న ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో లాంచ్ కానున్నాయి.


ఐకూ 11లో 6.78 అంగుళాల ఈ6 అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనున్నట్లు సమాచారం. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఈ ఫోన్‌లో ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఐకూ 11 పని చేయనుందని వార్తలు వస్తున్నాయి. 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?