వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ చైనాలో గత నెలలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో వన్‌ప్లస్ 10ఆర్ లైట్ పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ ఇండియన్ ఐఎంఈఐ డేటాబేస్‌లో కనిపించింది. వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ మోడలే దీనికి కూడా అందించారు. ఈ ఫోన్ మనదేశంలో మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ ఫోన్ గురించి మార్చిలోనే ట్వీట్ చేశారు. పీజీజెడ్110 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇండియన్ ఐఎంఈఐ డేటాబేస్‌లో కూడా కనిపించింది కాబట్టి త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.
వన్‌ప్లస్ 10ఆర్ లైట్ ధర (అంచనా)
ఈ ఫోన్ చైనాలో 1,99 యువాన్ల (సుమారు రూ.23,300) ధరతో లాంచ్ అయింది. ఒకవేళ మనదేశంలో లాంచ్ అయితే దీని ధర రూ.25 వేల లోపు నుంచే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వన్‌ప్లస్ 10ఆర్ ధర రూ.38,999గా ఉంది.
వన్‌ప్లస్ 10ఆర్ లైట్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!