నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్ పాస్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ పాస్ ద్వారా వినియోగదారులు ఈ ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి స్పెషల్ ఇన్వైట్ కోడ్ లేకుండా రూ.2,000 చెల్లించి దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
ఒకవేళ వినియోగదారులు ఫోన్ కొనకపోతే ఈ మొత్తం రీఫండ్‌గా పొందవచ్చు. జులై 7వ తేదీ వరకు ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ పాస్ కొనుగోలు చేసిన వారు ఫోన్‌ను జులై 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి జులై 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ కొనకపోతే జులై 19వ రూ.2,000 రీఫండ్ పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం.
ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ప్రకారం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 469.99 యూరోలుగా (సుమారు రూ.38,750) ఉండనుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 499.99 యూరోలుగానూ (సుమారు రూ.41,250), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 549.99 యూరోలుగానూ (సుమారు రూ.45,350) నిర్ణయించనున్నారని సమాచారం.
వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన అనంతరం నథింగ్ కంపెనీని స్థాపించాడు. వన్‌ప్లస్, ఒప్పో భాగస్వామ్యం అనంతరం కార్ల్ పెయ్ బయటకు రావడం, ఈ నథింగ్ బ్రాండ్‌ను స్థాపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో నథింగ్‌ను వన్‌ప్లస్‌కు ప్రత్యామ్నాయంగా కూడా కొందరు టెక్ నిపుణులు చూస్తున్నారు. వారి అంచనాలను నథింగ్ ఫోన్ (1) అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగితే చాలు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!