నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ జులై 12వ తేదీన లాంచ్ కావడానికి సిద్ధం అవుతోంది. ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్‌కు ముందు దీని ప్రీ-బుకింగ్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లీకుల ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,000 చెల్లించి ఈ ఫోన్ ప్రీ-బుక్ చేసుకోవచ్చు. మల్టీపుల్ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్ వివరాలు లీక్ చేశారు. ఈ వివరాల ప్రకారం మీరు చెల్లించే రూ.2,000 ఫోన్ కాస్ట్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. జులై 18వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే దీని ప్రీ-రిజర్వేషన్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
నథింగ్ ఫోన్ 1 ధర 500 యూరోల (సుమారు రూ.41,300) రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది. దీని స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మొదటి టీజర్ ప్రకారం ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుందని మాత్రం అంచనా వేయవచ్చు.
నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉండనుంది. నథింగ్ ఇయర్ 1 తరహాలో పారదర్శకమైన డిజైన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఏవి నిజమో? ఏవి పుకార్లో? తెలియాలంటే జులై 12వ తేదీ వరకు ఆగాల్సిందే. ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తే... ఈ తరహాలో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ ఇదే కానుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!