నథింగ్ తన మొదటి స్మార్ట్ ఫోన్‌ను అధికారికంగా ప్రపంచానికి చూపించింది. దీనికి సంబంధించిన సేల్‌ను అధికారిక లాంచ్‌కు ముందే కంపెనీ నిర్వహిస్తుంది. స్టాక్ఎక్స్‌లో జూన్ 21వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించిన 100 యూనిట్లను విక్రయించనున్నారు.
గతంలో నథింగ్ ఇయర్ (1) విషయంలో కూడా కంపెనీ ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. ఇప్పుడు కూడా స్టాక్ఎక్స్‌తో మొదటి 100 యూనిట్ల సేల్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో ప్రతి ఫోన్ 1-100 వరకు లేజర్‌తో సీరియల్ నంబర్లు వేయనున్నారు. బిడ్‌లో ఎవరికి ఏ నంబర్ వచ్చిందో ఈ పైనున్న నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ సేల్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు నథింగ్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఫోన్‌పై బిడ్‌కు సంబంధించిన సీరియల్ నంబర్ కూడా ఉండనుందని తెలిపింది. జూన్ 21వ తేదీన మనదేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు వీటికి సంబంధించిన వేలం జరగనుంది. జూన్ 23వ తేదీ వరకు ఈ బిడ్ ఓపెన్‌లో ఉండనుంది. స్టాక్ఎక్స్ అకౌంట్ ద్వారా లాగిన్ అయి ఈ బిడ్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు.
దీనికి సంబంధించిన హ్యాండ్స్ ఇన్ వీడియోలు కూడా గత వారంలోనే బయటకు వచ్చాయి. వీటిని బట్టి ఈ ఫోన్ వెనకవైపు ఎల్ఈడీ లైట్లు కూడా ఉండనున్నాయి. ప్రత్యేకమైన డిజైన్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ లైట్‌ను బట్టి ఫోన్ రింగ్ అవుతుందని లేదా నోటిఫికేషన్ వచ్చిందని తెలుసుకోవచ్చు.
జులై 12వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో, గ్లోబల్‌గా లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‌కు రానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్‌పై పనిచేసే ప్రత్యేకమైన నథింగ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నట్లు సమాచారం.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!