నోకియా.. ఒకప్పుడు మొబైల్ ప్రపంచంలో మార్మోగిన పేరు. నోకియా ఫోన్ అంటే వినియోగదారులకు ఎనలేని ఆసక్తి. మంచి బ్యాటరీ బ్యాకప్. కింద పడినా తట్టుకునే బాడీ. రఫ్ అండ్ టఫ్ గా ఉపయోగించుకునే అవకాశం. ఇవే ఆ మోబైల్ ను గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల చెంతకు చేరేలా చేసింది. స్మార్ట్ ఫోన్ల రాకతో పోటీలో వెనుకబడింది. విండోస్ ఓఎస్ తో యూజర్ల ముందుకు వచ్చినా, పెద్దగా క్లిక్ కాలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అడుగు పెట్టాయి. నెమ్మదిగా వరుస బెట్టి రకరకాల స్మార్ట్ ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్లతో పాటు, మరోవైపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మోబైల్ వరల్డ్ లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.


నోకియా సీ12 ధర కేవలం రూ. 5,999


తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. నోకియా సీ12 పేరిట భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. కంపెనీ ఈ నూతన స్మార్ట్ ఫోన్  ధర కేవలం రూ. 5,999గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్‌ సైట్స్‌ లో అందుబాటులో ఉన్నాయి.  


అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులోకి..


ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ఫోన్ అయిన ఫీచర్లు బాగానే ఉన్నాయి. 2 జీబీ ర్యామ్‌ అమర్చారు. 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ అందిస్తున్నారు. ఇక డిస్ ప్లే కూడా చాలా బాగుంది. 6.3 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ ప్లేను అందిస్తోంది.  బ్రైట్‌ నెస్ బూస్ట్, సెల్ఫీ నాచ్‌ ను సైతం ఈ స్మార్ట్ ఫోన్ కు యాడ్ చేసింది. ఇక నోకియా సీ 12 Unisoc 9863A1 ఆక్టాకోర్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతోంది. కెమెరా పనితీరు కూడా చాలా బాగుంది. ఇందులో 8 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందిస్తోంది.  5W చార్జింగ్‌‌ కు సపోర్ట్ చేసే 3000mAh బ్యాటరీని అందిస్తోంది. ఆండ్రాయిడ్‌ 12గో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది. ఇక దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్‌ ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ పలు రంగుల్లో అందుబాటులో ఉంది. డార్క్ సియాన్, చార్‌ కోల్, లైట్ మింట్ కలర్స్‌ లలో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ తో తన అమ్మకాలు భారీగా పెంచుకోవాలని  నోకియా కంపెనీ భావిస్తోంది.  






Read Also: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!