నోకియా జీ11 ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. బ్లోట్‌వేర్ లేని ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
నోకియా జీ11 ప్లస్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. చార్‌కోల్ గ్రే, లేక్ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో లీడింగ్ రిటైల్, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
నోకియా జీ11 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై నోకియా జీ11 ప్లస్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ ఫిక్స్‌డ్ ఫోకస్ కెమెరా కూడా ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే మూడు రోజుల బ్యాటరీ లైఫ్ అందించనుందని కంపెనీ తెలిపింది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?