నోకియా 2660 ఫ్లిప్ మనదేశంలో లాంచ్ అయింది. నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 2.8 అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 1.77 అంగుళాల అవుటర్ డిస్‌ప్లే ఉండనుంది. యూనిసోక్ టీ107 ప్రాసెసర్, 48 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


నోకియా 2660 ఫ్లిప్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 48 ఎంబీ + 128 ఎంబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.4,699గా నిర్ణయించారు. నోకియా వెబ్‌సైట్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో నోకియా 2660 ఫ్లిప్ కొనుగోలు చేయవచ్చు.


నోకియా 2660 ఫ్లిప్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఈ ఫోన్‌లో అందించారు. 4జీ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. ఈ ప్లిప్ ఫోన్ సిరీస్ 30ప్లస్ ఓఎస్‌పై పనిచేయనుంది. ఇందులో 2.8 అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ క్యూవీజీఏగా ఉంది. మరో వైపు 1.77 అంగుళాల అవుటర్ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ క్యూక్యూవీజీఏగా ఉంది.


48 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


కనెక్టివిటీ విషయానికి వస్తే... ఇందులో బ్లూటూత్ వీ4.2 సపోర్ట్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. రిమూవబుల్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అయింది. 2.75W చార్జింగ్‌ను నోకియా 2660 ఫ్లిప్ సపోర్ట్ చేయనుంది.  24.9 గంటల స్టాండ్‌బై టైంను దీని బ్యాటరీ అందించనుంది. దీని మందం 0.55 సెంటీమీటర్లు కాగా, బరువు 123 గ్రాములుగా ఉంది.


నోకియా ఇటీవలే 110 2022 ఫీచర్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మనదేశంలో రూ.1,699కే లాంచ్ అయింది. రోజ్ గోల్డ్ వేరియంట్ ధర రూ.1,799గా ఉంది. ఈ ఫీచర్ ఫోన్‌లో ఆటో కాల్ రికార్డింగ్, వెనకవైపు ఇన్ బిల్ట్ కెమెరా ఉన్నాయి. దీంతోపాటు మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా స్టోరేజ్‌ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. వెనకవైపు టాప్ ఎడ్జ్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది.


నోకియా క్లాసిక్ గేమ్ అయిన ఐకానిక్ స్నేక్ సహా కొన్ని గేమ్స్‌ను ఇందులో అందించారు. వైర్‌లెస్, వైర్డ్ ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, వీడియో, ఎంపీ3 ప్లేయర్లు కూడా ఉన్నాయి. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. వినియోగదారులు ఈ ఫోన్‌లో 8 వేలకు పైగా పాటలను స్టోర్ చేసుకోవచ్చని కంపెనీ అంటోంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!