నోకియా 110 2022 ఫీచర్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో రూ.1,699కే లాంచ్ అయింది. సియాన్, చార్‌కోల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లో రోజ్ గోల్డ్ వేరియంట్ ధర రూ.1,799గా ఉంది. నోకియా 110 2022 కొనుగోలు చేస్తే రూ.299 విలువైన ఇయర్ ఫోన్స్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తుంది.
నోకియా 110 2022 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫీచర్ ఫోన్‌లో ఆటో కాల్ రికార్డింగ్, వెనకవైపు ఇన్ బిల్ట్ కెమెరా ఉన్నాయి. దీంతోపాటు మ్యూజిక్ ప్లేయర్ కూడా అందుబాటులో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా స్టోరేజ్‌ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. వెనకవైపు టాప్ ఎడ్జ్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది.
నోకియా క్లాసిక్ గేమ్ అయిన ఐకానిక్ స్నేక్ సహా కొన్ని గేమ్స్‌ను ఇందులో అందించారు. వైర్‌లెస్, వైర్డ్ ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, వీడియో, ఎంపీ3 ప్లేయర్లు కూడా ఉన్నాయి. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. వినియోగదారులు ఈ ఫోన్‌లో 8 వేలకు పైగా పాటలను స్టోర్ చేసుకోవచ్చని కంపెనీ అంటోంది.
హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవలే నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో అనే వినూత్నమైన ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో నోకియా ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించారు. ఈ ఫోన్ ధరను 64.99 యూరోలుగా (సుమారు రూ.5,190) నిర్ణయించారు.
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో స్మార్ట్ ఫోన్‌లో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 128 ఎంబీ స్టోరేజ్ స్పేస్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్‌గా ఉంది. వీజీఏ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉంది. డ్యూయల్ సిమ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఈ మొబైల్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!