Motorola Edge 40: మోటొరోలా ఎడ్జ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే మోటొరోలా ఎడ్జ్ 40. ప్రస్తుతానికి యూరోప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఈ ఫోన్ లాంచ్ లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను అందించారు.


మోటొరోలా ఎడ్జ్ 40 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 599.99 యూరోలుగా (సుమారు రూ.54,000) నిర్ణయించారు. ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ బ్లాక్, నెబ్యులా గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. యూరోప్‌లో దీని సేల్ త్వరలో ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


మోటొరోలా ఎడ్జ్ 40 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌ను మోటొరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్‌లో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


ఈ స్మార్ట్ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 68W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. గ్రావిటీ సెన్సార్, కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 167 గ్రాములుగా ఉంది.


మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. దీని ధరను రూ.59,999గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ స్కిన్‌పై మోటొరోలా ఎడ్జ్30 పనిచేయనుంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఏకంగా 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4610 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.