మోటొరోలా ఎడ్జ్ 30 మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.5 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4020 ఎంఏహెచ్‌గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నటి 5జీ ఫోన్ అని కంపెనీ అంటోంది.


మోటొరోలా ఎడ్జ్ 30 ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.27,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. మే 19వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే... రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అరోరా గ్రీన్, మెటాలిక్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


మోటొరోలా ఎడ్జ్ 30 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ కంటెంట్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


దీని బ్యాటరీ సామర్థ్యం 4020 ఎంఏహెచ్‌గా ఉంది. 33W టర్బోపవర్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఐపీ52 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్30 పనిచేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2  మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, కంపాస్ వంటి సెన్సార్లు కూడా అందించారు. దీని మందం 0.68 సెంటీమీటర్లు కాగా... బరువు 155 గ్రాములుగా ఉంది.