మోటో జీ71 5జీ స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో తగ్గించారు. ఈ ఫోన్ ధరపై ఏకంగా రూ.3,000 తగ్గింపు లభించడం విశేషం. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ముందువైపు సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ తరహా డిజైన్ అందుబాటులో ఉంది.


మోటో జీ71 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.18,999గా నిర్ణయించారు. అయితే తర్వాత దీన్ని రూ.15,999కు తగ్గించారు. ఆర్కిటిక్ బ్లూ, నెఫ్ట్యూన్ గ్రీన్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


మోటో జీ71 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W టర్బోపవర్ చార్జర్‌ను ఫోన్‌తో పాటు అందించనున్నారు. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!