మోటొరోలా మనదేశంతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. మోటో జీ42 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 4వ తేదీన లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ బ్రెజిల్‌లో ఈ సంవత్సరమే లాంచ్ అయింది. ఇందులో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను మోటో అందించింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై మోటో జీ42 పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
బ్రెజిల్‌లో ఈ ఫోన్ అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. అక్కడ దీని ధరను 1,699 బ్రెజిలియన్ రియాళ్లుగా (సుమారు రూ.25,400) నిర్ణయించారు. మనదేశంలో దీని ధర రూ.25 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
మోటో జీ42 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ42 పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ జీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. మోటో జీ42 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండగా... యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్లస్ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... మోటో జీ42 వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ఈ మూడు కెమెరాల్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా మోటో జీ42లో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కంపాస్ సెన్సార్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొబైల్ పక్కభాగంలో ఉంది. మోటో జీ42 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 20W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా... బరువు 174.5 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!