Mobile Recharge Price Hike: దేశంలోని 2 పెద్ద టెలికాం కంపెనీలు Airtel, Reliance Jio మరోసారి ప్రజలకు షాకివ్వడానికి సిద్ధమవుతున్నాయి. అవును, ఒక రిపోర్ట్ ప్రకారం త్వరలోనే మొబైల్ రీచార్జ్ ధరలు సుమారు 15 శాతం వరకు పెరగవచ్చు.  ఇటీవల Airtel తన కొన్ని తక్కువ ధర ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ నిలిపివేసింది. దాంతో వినియోగదారులు ఇప్పుడు ఖరీదైన రీచార్జ్‌లు చేయించుకోవాల్సి వస్తోంది. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మళ్లీ రీచార్జ్ ధరలు పెరగనుండటం ప్రజలకు చాలా భారంగా మారవచ్చు. అందుకు సంస్థలు ఏం కారణాలు చెబుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

Continues below advertisement

3-4 నెలల్లో రీచార్జ్ ధరలు పెరగొచ్చు

మీడియా రిపోర్ట్ ప్రకారం Jio మరియు Airtel తమ మొబైల్ టారిఫ్‌లను 12 నుంచి 15 శాతం వరకు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఇప్పటికి కేవలం ఒక మార్కెట్ ఫోర్‌కాస్ట్ మాత్రమే. రెండు కంపెనీల నుంచి ఇలాంటి ధర పెంపుపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఈ అంచనా నిజమైతే, దాని ప్రభావం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ 2 రకాల వినియోగదారులపై కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి మొబైల్ రీచార్జ్ చేసుకునే వినియోగదారులు ఇప్పుడు రీచార్జ్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

Continues below advertisement

టారిఫ్‌లు ఎందుకు పెరగొచ్చు?

టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడూ తమ టారిఫ్‌లలో మార్పులు చేస్తుంటాయి. దీని వెనుక నెట్‌వర్క్ విస్తరణ, 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పెక్ట్రం ఖర్చులు, అలాగే ప్రతి కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం అంటే ARPU పెంచడం లాంటి కారణాలు ఉంటాయి. కంపెనీలు ధరలు పెంచితే తక్కువ ధర ప్లాన్‌లు మరింత ఖరీదు అవుతాయి. అంటే, ఇప్పటికే ప్రైమరీ ప్లాన్ రీఛార్జ్ చేస్తున్న వినియోగదారులు కొంచెం ఎక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది.

Jio, Airtel లాభాలపై ప్రశ్నలు

మొబైల్ రీచార్జ్ మరింత ఖరీదు అవుతుందన్న చర్చ వైరల్ అవుతోంది. Ji, Airtel రెండూ గత సంవత్సరం 30,000 కోట్లకు పైగా నెట్ ప్రాఫిట్ నమోదు చేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులకు కంపెనీలు ఇంత లాభం ఆర్జిస్తున్నప్పుడు మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని భావించారు. మళ్లీ ఎందుకు ఎందుకు పెంచుతున్నార్న ప్రశ్న మొదలైంది.

వినియోగదారులపై ప్రభావం 

వైరల్ అవుతున్న సమాచారం మేరకు 12 నుంచి 15 శాతం రీచార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు, ఒక రీచార్జ్ ప్లాన్ ధర 500 రూపాయలు ఉంటే, అది 12 శాతం పెరిగితే అదే ప్లాన్ కోసం 560 రూపాయలు చెల్లించాలి. అదే 15 శాతం పెరిగితే కస్టమర్ 575 రూపాయలు చెల్లించాల్సి రావచ్చు.

టెలికాం రంగంలో పెరుగుతున్న Duopoly

వాస్తవానికి, భారత్ టెలికాం మార్కెట్‌లో Jio, Airtel ఆధిపత్యం కొనసాగుతోంది. మరోవైపు Vodafone Idea, BSNL వంటి ఇతర ఆపరేటర్లు కూడా ఉన్నప్పటికీ, ప్రైవేట్ మొబైల్ మార్కెట్‌లో Jio, Airtel స్థానం పటిష్టంగా ఉంది. టెలికాం రంగంలో Duopoly గురించి చర్చ కొనసాగుతూనే ఉంటుంది. డుయోపోలీ అంటే ఒక రంగంలో ప్రధానంగా 2 కంపెనీల ఆధిపత్యం ఉండే మార్కెట్ కండీషన్. ఇలాంటి మార్కెట్‌లో 2 కంపెనీలు తమ టారిఫ్‌లు పెంచితే, వినియోగదారుల వద్ద సేవల కోసం మరో ఆప్షన్ ఉండదు.