5G Smartphones Under Rs15,000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారు. ఎక్కువ బడ్జెట్ లేదని ఆలోచిస్తున్నారా. మీ లాంటి వాళ్ల కోసమే ఈ ఏడాది సరికొత్‌త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు లభిస్తున్న చాలా స్మార్ట్ ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీగా మాత్రమే కాదు ఫీచర్ల విషయంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటున్నాయి కాబట్టి 15,000 కంటే తక్కువ ధరలో లభించే టాప్ 5G స్మార్ట్‌ఫోన్ల గురించి మీకు తెలియజేస్తున్నాం.
1.CMF ఫోన్ 1'నథింగ్' బ్రాండ్‌కు చెందినది ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌లో 6.67-inch AMOLED ప్యానెల్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అదే సమయంలో దాని స్క్రీన్ చాలా బ్రైట్‌గా ఉంటుంది. ఎండలో, ఇండోర్ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకునే సౌలభ్యం కూడా ఈ ఫోన్ స్క్రీన్‌కు ఉంది. CMF ఫోన్ 1లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 50MP ప్రైమరీ లెన్స్ ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్‌ల ఆప్షన్స్‌తో వస్తుంది. CMF ఫోన్ 1 లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
2. Poco M7 Pro 5Gబడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్లు అందించడానికి Poco బ్రాండ్ ప్రసిద్ధి చెందింది. Poco M7 Pro 5G లో ఫాస్ట్ ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేటుతో కూడిన డిస్ప్లే ఉంటుంది. దీని బ్యాటరీ చాలా పవర్‌ఫుల్. దీనివల్ల ఫోన్ ఎక్కువసేపు వాడుకున్నా ఛార్జింగ్ త్వరగా అయిపోయిందన్న ఫీల్ ఉండదు. దీని కెమెరా సెటప్ కూడా బాగుంది. ఇది మంచి ఫోటోలను తీయడంలో సహాయపడుతుంది.
3. Samsung Galaxy M14 5Gభారతదేశంలో అత్యంత నమ్మదగిన బ్రాండ్లలో Samsung ఒకటి. Galaxy M14 5Gలో పవర్‌ఫుల్ బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లే ఉంది. Samsung కెమెరాలు బ్రైట్‌గా ఉండే స్పష్టమైన ఫోటోలు తీయడానికి ఉపయోగపడతాయి. అలాగే, ఈ ఫోన్‌కు లాంగ్ రన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభించే అవకాశం ఉంది, దీనివల్ల ఇది ఒక నమ్మకైన ఆప్షన్‌గా మారుతుంది.
4. Realme Narzo 60x 5GRealme బ్రాండ్‌కు చెందిన Narzo సిరీస్ ఎల్లప్పుడూ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మీరు చెల్లించే ప్రతి రూపాయకి న్యాయం చేసేలా ఈ ఫోన్ ఉంటుంది. Narzo 60x 5Gలో వేగవంతమైన ప్రాసెసర్, స్మూత్ డిస్ప్లే, స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, సోషల్ మీడియా వినియోగదారులకు ఇది ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు.
5. Redmi Note 12 5GXiaomi కంపెనీ నుంచి వచ్చే Redmi Note సిరీస్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందింది. Redmi Note 12 5G పెద్ద డిస్ప్లే, ఫాస్ట్ ప్రాసెసర్, మంచి బ్యాటరీతో వస్తుంది. దీని కెమెరా సూపర్‌గా ఉంటుంది. ఈ ఫోన్ అన్ని రకాల వినియోగదారులకు ఒక ఆల్-రౌండర్ ఎంపికగా ఉంటుంది.