లావా బ్లేజ్ అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే దీని రెండర్లు, ధర, ఫీచర్ల వివరాలు మనదేశంలో లీకయ్యాయి.
దీని లీకైన రెండర్ల ప్రకారం ఫోన్ వెనక బ్లాక్ కలర్ ఉన్న గ్లాస్ ప్యానెల్ ఉండనుంది. నాలుగు కెమెరాల సెటప్‌ను కూడా వెనకవైపు చూడవచ్చు. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లావా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ సునీల్ రైనా కూడా బ్లేజ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్‌ను టీజ్ చేశారు.
మైస్మార్ట్ ప్రైస్ కథనం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.10 వేలలోపే ఉండనుంది. మరో లీక్ ప్రకారం లావా తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను ఈ నెలలోనే లాంచ్ చేయనుంది. ఇవి బ్లేజ్ సిరీస్ ఫోన్లేనా, లేకపోతే వాటి కంటే ముందు మరో స్మార్ట్ ఫోన్ ఏమైనా వస్తుందా అనేది చూడాలి.
లావా తన వినియోగదారులకు డోర్‌స్టెప్ రిపేర్ సర్వీసులను కూడా అందిస్తుంది. స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన సమస్యలను హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకమైన వ్యక్తులను కూడా లావా నియమిస్తుంది. దేశవ్యాప్తంగా రెండు వేల మందిని మొదటగా నియమించాలన్నది లావా ప్లాన్.
సాఫ్ట్‌వేర్ లేదా చిన్న హార్డ్‌వేర్ సంబంధిత సమస్యలైతే మీ ఇంట్లోనే అప్పటికప్పుడు ఫోన్ రిపేర్ చేస్తారు. ఒకవేళ పెద్దదైతే మాత్రం ఫోన్ తీసుకుని, రిపేర్ చేసి, వినియోగదారుని ఇంటికే తిరిగి డెలివరీ చేస్తారు. సర్వీసుకు అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!