జియో ఫోన్ 5జీ ధర మనదేశంలో రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్యలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ వేర్వేరు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, స్క్రీన్ సైజుల్లో మార్కెట్లోకి రానుంది. హోల్ పంచ్ తరహా కటౌట్‌ను ఇందులో అందించనున్నారు. రూ.8 వేలలోపే 5జీ ఫోన్ అంటే ఈ ఫోన్ జనాల్లోకి బాగా వెళ్లిపోయే అవకాశం ఉంది.
జియో 5G ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
జియో 5G స్మార్ట్ ఫోన్ హెచ్‌డీ+ రిజల్యూషన్ స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందించనున్నారు.
గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు కొన్ని జియో యాప్ లకు మాత్రమే సపోర్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జియో 5G ఫోన్ USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ను కలిగి ఉంటుందట.
గతంలో జియో నుంచి వచ్చిన ఫోన్ మాదిరిగానే ఇందులో ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. గూగుల్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ టెక్ట్స్, గూగుల్ లెన్స్, గూగుల్ ట్రాన్స్ లేట్ ఉండనున్నాయి. 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది. ముందు భాగంలో సెల్పీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చినట్లు సమాచారం.
జియో నుంచి 2017లో తొలి ఫీచర్ ఫోన్ విడుదల అయ్యింది. ఈ ఫోన్ కు జనాల నుంచి మంచి ఆదరణ దక్కింది. గతేడాది 4జీ ఫోన్ కూడా జియో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కూడా వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది. ఇక భారత్ లో 5G సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
జియో ఎయిర్‌ఫైబర్, జియో క్లౌడ్ పీసీ సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే తన 45వ వార్షిక సదస్సులో లాంచ్ చేసింది. వీటిలో జియో ఎయర్ ఫైబర్ అనేది ఒక హోం గేట్‌వే సర్వీసు. అంటే దీన్ని పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసి వైఫై హాట్‌స్పాట్ లాగా ఉపయోగించుకోవచ్చన్న మాట. ఇది జియో ట్రూ 5జీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనుంది.
ఇక జియో క్లౌడ్ పీసీ అనేది ఒక వర్చువల్ పీసీలా పనిచేయనుంది. జియో ట్రూ 5జీ కనెక్టివిటీ ద్వారానే ఈ సర్వీసును కూడా ఉపయోగించవచ్చు. ఎటువంటి హార్డ్‌వేర్ రిక్వైర్‌మెంట్స్ లేకుండానే ఈ డివైస్‌ను వాడుకునే అవకాశం ఉ:ది. మల్టీపుల్ పీసీలను, యూజర్లను కనెక్ట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ఫిజికల్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను రీప్లేస్ చేయనుందని టెక్ నిపుణుల అభిప్రాయం.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?