భారత టెలికం రంగ సంచలనం జియో.. సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకురాబోతుందని వార్తలు వస్తున్నాయి. జియో ఫోన్ 5G పేరుతో ఈ కొత్త ఫోన్‌ను జనాల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇంత వరకు ఈ ఫోన్ విడుదల గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. త్వరలోనే ఈ  ఫోన్ ను  అందుబాటులోకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


జియో నుంచి 2017లో తొలి ఫీచర్ ఫోన్ విడుదల అయ్యింది. ఈ ఫోన్ కు జనాల నుంచి మంచి ఆదరణ దక్కింది. గతేడాది 4జీ ఫోన్ కూడా జియో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కూడా వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది.  ఇక భారత్ లో 5G సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో 5G  స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముఖేష్ అంబానీ కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. జియో 5జీ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఈ లేటెస్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. 


జియో 5G  ఫోన్  స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 
జియో 5G స్మార్ట్ ఫోన్  హెచ్‌డీ+ రిజల్యూషన్‌ స్క్రీన్‌తో రానుంది. 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  60Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్టు చేస్తుంది.  ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480  5జీ  ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.


గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు కొన్ని జియో యాప్ లకు  మాత్రమే సపోర్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో జియో నుంచి వచ్చిన ఫోన్ మాదిరిగానే ఇందులో ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. గూగుల్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ టెక్ట్స్, గూగుల్ లెన్స్, గూగుల్ ట్రాన్స్ లేట్ ఉండనున్నాయి.


ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జియో 5G  ఫోన్ USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ ను కలిగి ఉంటుందట. ఇక ఫోటోలు, వీడియోల కోసం  13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది. ముందు భాగంలో సెల్పీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చినట్లు సమాచారం. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను సైతం అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
జియో 5G  ఫోన్ ధర ఎంతంటే?
జియో నుంచి వస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేలకు మించి ఉండదని తెలుస్తోంది. గతేడాది 4G ఫోన్‌ను జియో రూ. 6,499 రూపాయలకే  మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత దాని ధరను మరింత తగ్గించారు. ఇప్పుడు రూ.ఐదు వేలలోపే ఆ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర కూడా దానికి కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!