ఐకూ 10 సిరీస్ చైనాలో జులై 19వ తేదీన లాంచ్ కానుంది. ఐకూ 10, ఐకూ 10 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐకూ 10 ప్రో కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీని స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఇందులో 6.78 అంగుళాల 2కే ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఎల్టీపీవో ప్యానెల్ కూడా ఈ ఫోన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇన్ డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌తో పాటు అందించనున్నారు.
8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్1 సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ ఉండనున్నాయి. వివో వీ1+ ఇమేజింగ్ చిప్‌ను ఈ ఫోన్‌లో అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 200W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ లేదా ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఐకూ 10 సిరీస్ డిజైన్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఐకూ 10 సిరీస్‌లో రెండు ఫోన్ల డిజైన్ దాదాపు ఒకేలా ఉండనుంది. వీటిలో రెండు కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి. రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేసే చాన్స్ ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!