iPhone 17e Features | కొత్త ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆపిల్ కంపెనీ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. గత ఏడాది ఐఫోన్ 17 విడుదల చేసిన Apple ఫిబ్రవరి లేదా మార్చిలో తన చవకైన iPhone 17eని మార్కెట్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. గత కొంతకాలంగా, దాని ఫీచర్ల గురించి లీకులు వస్తున్నాయి. Apple తన వినియోగదారులకు చవకైన ధరలకు శక్తివంతమైన అప్‌గ్రేడ్‌ను అందించాలని భావిస్తున్నట్లు కొత్త వేరియంట్ సూచిస్తుంది. iPhone 17e అప్‌గ్రేడ్ చేసినా, గతేడాది విడుదలైన iPhone 16e ధరకే విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ప్రచారం జరుగుతోంది.

Continues below advertisement

iPhone 17eలో ఈ అప్‌గ్రేడ్‌లు లభించే అవకాశం

డైనమిక్ ఐలాండ్- iPhone 17eలో పెద్ద విజువల్ మార్పు ఉండవచ్చు. గత సంవత్సరం మోడల్ నాచ్‌తో ప్రారంభించారు. అయితే ఈసారి Apple కొత్త iPhoneకి న్యూ లుక్ ఇస్తుంది. iPhone 17e డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంటుంది. ఇది కొన్ని నెలల కిందట విడుదలైన iPhone 17 సిరీస్‌లాగే డిజైన్ ల్యాంగ్వేజ్ కలిగి ఉంటుంది.

Continues below advertisement

A19 చిప్‌సెట్- చవకైన ధర ఉన్నప్పటికీ Apple ఈ iPhone 17లో A19 చిప్‌సెట్‌ను అందిస్తుంది. ఇది అద్భుతమైన పనితీరుతో కస్టమర్ల నమ్మకాన్ని నిలుపుకుంది. ఈ మిడ్-రేంజ్ iPhoneలో Apple ఎలాంటి లోటుపాట్లు ఉంచకూడదని ఇది సూచిస్తుంది.

MagSafe సపోర్ట్- iPhone 16eలో MagSafe సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో ఐఫోన్ వినియోగదారులు సంతోషంగా లేరు. ఇప్పుడు Apple iPhone 17eలో MagSafe సపోర్ట్‌ను అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇది వెనుక భాగంలో మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే, ఐఫోన్ 17e 20w నుండి 25W ఛార్జింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది.

18MP సెంటర్ స్టేజ్ కెమెరా- iPhone 17 తరహాలోనే ఐఫోన్ 17e కూడా 18MP అప్‌గ్రేడెడ్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది సెంటర్ స్టేజ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు, దీనిలో మీరు ఫోన్‌ను పోర్ట్రెయిట్ ఓరియంటేషన్‌లో ఉంచడం ద్వారా ల్యాండ్‌స్కేప్ గ్రూప్ ఫొటోలను కూడా తీసుకోవచ్చు.

ధర ఎంత ఉంటుంది?

e సిరీస్‌లో Apple చవకైన ధర కలిగిన iPhoneలను విడుదల చేస్తుంది. iPhone 17eలో కొత్త ఫీచర్లను జోడించిన తర్వాత, కంపెనీ దాని ధరను పెంచకపోవచ్చని భావిస్తున్నారు. ఇది గత సంవత్సరం విడుదలైన iPhone 16e ధరకే మార్కెట్లోకి వస్తుందని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఐఫోన్ 17e రిలీజ్ అయితే కనుక ఇది యాపిల్ కంపెనీ చౌకైన iPhone మోడల్ అవుతుంది. భారత మార్కెట్లో iPhone 16e ప్రారంభ ధర రూ. 59,900 కాగా, ఐఫోన్ 17e సైతం ఇదే ధరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.