Discount on iPhone 17 Sales | ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ విడుదలై నెల కూడా కాలేదు, కానీ లేటెస్ట్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గత ఏడాది విడుదలైన iPhone 16ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? iPhone 17పై లభిస్తున్న డీల్‌ను విన్న తర్వాత మీరు మనసు మార్చుకుంటారు. డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సెప్టెంబర్ 9న విడుదలైన iPhone 17ని రూ. 20,000 కంటే ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఐఫోన్‌ 17లో ఏయే ఫీచర్లు ఉన్నాయో, దానిపై ఎలాంటి డీల్ లభిస్తుందో తెలుసుకుందాం.

Continues below advertisement

iPhone 17 ఫీచర్లు

ఈ ఫోన్ 6.3 అంగుళాల ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేతో మార్కెట్లోకి వచ్చింది. ఇది ప్రో మోషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ప్రోమోషన్ ప్యానెల్ కారణంగా, iPhone 17 ప్రో మోడల్ లాగానే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ చేస్తుంది. ఇది స్క్రీన్‌పై నడుస్తున్న కంటెంట్‌ను బట్టి రిఫ్రెష్ రేట్‌ను 1Hz నుండి 120Hz వరకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకోగలదు. అల్యూమినియం,  గ్లాస్ ఫినిషింగ్‌తో రూపొందిన ఈ మోడల్ 7.3mm మందంగా ఉంటుంది. ఇది Apple తాజా A19 చిప్‌ను కలిగి ఉంది. ఇది 8GB RAM సపోర్ట్ చేస్తుంది. దీని వెనుక భాగంలో 48MP+12MP డ్యూయల్ కెమెరా సెటప్ కెమెరా ఇచ్చారు. iPhone 17 ముందు భాగంలో సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది.

Continues below advertisement

ఐఫోన్‌పై అద్భుతమైన డీల్

ప్రస్తుతం క్రోమా స్టోర్లలో ఈ ఐఫోన్ బంపర్ ఆఫర్‌తో లభిస్తుంది. రూ. 82,900 ధర కలిగిన ఈ లేటెస్ట్ ఫోన్‌పై రూ. 6,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు పాత ఫోన్‌పై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ధర లభిస్తుంది. ఈ విధంగా ఫోన్‌పై మొత్తం డిస్కౌంట్ రూ. 21,000 వరకు ఆదా అవుతుంది. మొత్తం డిస్కౌంట్ తర్వాత ఐఫోన్17 ఫోన్ ధర రూ. 61,900కి దిగొస్తుంది. మీరు నేరుగా Apple నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, యాపిల్ కంపెనీ iPhone 17 సిరీస్‌పై డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ EMI సౌకర్యాన్ని కస్టమర్లకు అందిస్తోంది.