ఐఫోన్ 14 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన లాంచ్ తేదీ ఆన్‌లైన్‌లో లీకైంది. 2022 సెప్టెంబర్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఎటువంటి సప్లై సంబంధిత సమస్యలు లేకపోతే ఈ టైమ్‌లైన్‌లోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది.


ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 14 ప్రో 6.1 అంగుళాల, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లేలు అందించే అవకాశం ఉంది.


ఈ నాలుగు ఫోన్లలో ప్రో మోడల్స్‌లో ఏ16 బయోనిక్ చిప్ ఉండనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లలో పాత ఏ15 బయోనిక్ చిప్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.


5 నానోమీటర్ ప్రాసెసర్ టెక్నాలజీ ద్వారా ఈ కొత్త ఏ16 బయోనిక్ చిప్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ15 బయోనిక్ కంటే మెరుగ్గా ఏ16 బయోనిక్ చిప్ పనిచేయనుంది. ఐఫోన్ 14 సిరీస్ డిస్‌ప్లే విషయంలో యాపిల్ పెద్ద స్టెప్ వేయనుందని సమాచారం.


ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌లో నాచ్ ఉన్న డిస్‌ప్లే బదులు వేరే తరహా డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది. ఐవోఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!