ఐఫోన్ 14 సిరీస్‌కు సంబంధించిన లీకులు ఇప్పటికే చాలా వచ్చాయి. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో స్టోరేజ్ 256 జీబీ నుంచి ప్రారంభం కానుందని గతంలో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే వీటిలో నిజం లేదని ఐఫోన్ 13 ప్రో తరహాలో 128 జీబీ నుంచే స్టోరేజ్ వేరియంట్లు ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో కూడా లాంచ్ కానుందని ఇప్పుడు తెలుస్తోంది. ప్రముఖ మార్కెట్ రీసెర్చర్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. ఇవన్నీ ఐఫోన్ 13 ప్రో మోడల్స్‌లోని స్టోరేజ్ వేరియంట్లే. ఈ వారం ప్రారంభంలో ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో వీటి ధరను లీక్ చేశారు. ఐఫోన్ 13 మోడల్స్ కంటే 15 శాతం అత్యధికంగా వీటి ధర ఉండనుందని సమాచారం. దీని ప్రకారం ఐఫోన్ 14 సిరీస్‌లో ప్రారంభ వేరియంట్ ధర 1,000 నుంచి 1,050 డాలర్ల మధ్యలో (మనదేశ కరెన్సీలో సుమారు రూ.79,000 నుంచి రూ.83,000 మధ్య) ఉండనుంది.
ఐఫోన్ 14 ప్రో సిరీస్‌లో కొత్త ఏ16 బయోనిక్ చిప్ ఉండనుందని తెలుస్తోంది. అంటే ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌ల్లో ఏ15 బయోనిక్ చిప్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఏ16 బయోనిక్ చిప్ ఉండే అవకాశం ఉంది. ఏ15 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌ను ఐఫోన్ 13 మోడల్స్‌లో కూడా అందించారు.
ఐఫోన్ 14 మ్యాక్స్ ఫీచర్లు (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా గతంలో ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో ఉండనుంది.
యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!