ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. జియోమార్ట్‌లో దీన్ని తగ్గింపు ధరతోనే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.79,900గా ఉండగా, జియోమార్ట్‌లో రూ.77,900కే కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు లభించనుంది. అంటే రూ.72,900కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉంది.


ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన ఈవెంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను అందించారు.


ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.


దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.


ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. కెమెరాలు మాత్రం ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?