ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై మొదటిసారి భారీ తగ్గింపును అందించారు. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లతో పాటు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఇది లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 13 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ సిరీస్ లాంచ్ అయింది. అమెజాన్‌లో కొత్త ఐఫోన 14ను రూ.57 వేల రేంజ్‌లోనే కొనుగోలు చేయవచ్చు.
ఈ సిరీస్‌లో యాపిల్ ఐఫోన్ 14నే అత్యంత చవకైన ఫోన్. దీని ధర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. అయితే దీన్ని అమెజాన్‌లో రూ.57 వేల రేంజ్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.78,400కు అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు లభించనుంది.
దీంతోపాటు ఈ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే మీ ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. రూ.16,300 వరకు ఎక్స్‌చేంజ్ ద్వారా తగ్గించనున్నారు. ఒకసారి ఈ ఆఫర్లు అన్నీ అప్లై చేస్తే ఐఫోన్ 14 ధర రూ.57,100కు తగ్గనుంది. అంటే రూ.21 వేలకు పైగా తగ్గనుందన్న మాట.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?