ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రివీల్ చేసింది. ఏకంగా 180W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లాంచ్ కానున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఈ టెక్నాలజీని సపోర్ట్ చేయనున్నాయి. ఈ టెక్నాలజీ ద్వారా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుందని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం మనదేశంలో వన్‌ప్లస్ 10ఆర్ 5జీ, రియల్‌మీ జీటీ నియో 3ల్లో 150W ఫాస్ట్ చార్జింగ్ అందుబాటులో ఉంది. ఇన్‌ఫీనిక్స్ తీసుకురానున్న 180W ఫాస్ట్ చార్జింగ్ మనదేశంలో అత్యంత వేగమైన ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కానుంది.
ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో చవకైన ల్యాప్‌టాప్‌ను కూడా లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐ3 + 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గానూ, ఐ3 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,990గానూ ఉంది.
ఐ5 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990గానూ, ఐ5 + 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,990గా నిర్ణయించారు. గ్రే, బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ల్యాప్‌టాప్ కొంటే మరో రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది.
ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 16:9 కాగా, 10వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌లను ఇన్‌ఫీనిక్స్ ఈ ల్యాప్‌టాప్‌లో అందించింది.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇందులో 50 డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 11 గంటల బ్రౌజింగ్, 11 గంటల వెబ్ బ్రౌజింగ్, 9 గంటల రెగ్యులర్ వర్క్, 9 గంటల వీడియో ప్లేబ్యాక్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 90 నిమిషాల సమయం పట్టనుందని కంపెనీ తెలిపింది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!