ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సిరీస్ ఈ సంవత్సరం మేలోనే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ 4జీ స్మార్ట్ ఫోన్లే. ఇప్పుడు ఈ సిరీస్‌లో 5జీ స్మార్ట్ ఫోన్లు కూడా రానున్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌కు ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 5జీ అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ జులైలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల ప్రకారం ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనుంది.
ఈ స్మార్ట్ ఫోన్లలో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. అయితే ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 5జీ, ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ల ధరలు తెలియరాలేదు. కానీ బడ్జెట్ రేంజ్‌లోనే ఇవి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కథనాల ప్రకారం ఇన్‌ఫీనిక్స్ నోట్ 5జీ సిరీస్ ఫోన్లు 12 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేయనున్నాయి.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సిరీస్‌లో నోట్ 12, నోట్ 12 టర్బో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇవి రెండూ పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్లే. ఇన్‌ఫీనిక్స్ నోట్ 12లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్‌పై ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 పనిచేయనుంది. ఈ ఫోన్ మందం 0.79 సెంటీమీటర్లు కాగా... బరువు 184.5 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!