ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే ఉంది. వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. డీటీఎస్ సరౌండ్ సౌండ్ సిస్టం కూడా ఇందులో అందించారు.


ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఇది అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. అల్ఫైన్ వైట్, టస్కనీ బ్లూ, వొల్కానిక్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతోపాటు రూ.1,099 విలువైన స్నోకోర్ ఎక్స్ఈ 18 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను రూ.1కే కొనుగోలు చేయవచ్చు.


ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ 6 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కూడా ఇందులో ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్ ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్, క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా ఉంది.


256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, జీ సెన్సార్, గైరోస్కోప్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.


200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. మిడ్ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ ఎంట్రీ ఇవ్వనుంది.


రెండు కలర్ ఆప్షన్లలో ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 6.7 అంగుళాల అమోఎల్ఈడీ లేదా కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇందులో అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. వీటిలో 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది. దీంతోపాటు టెలిఫొటో సెన్సార్, మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్ కాగా, 180W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ తెలుపుతోంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!