ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గత వారం లాంచ్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం అయింది. ఈ ఎంట్రీ లెవల్ 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. మనదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చవకైన 5జీ ఫోన్ ఇదే. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 5జీ, వివో టీ1 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.


ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఉంది. మెమ్‌ఫ్యూజన్ ర్యామ్ ఫీచర్ ద్వారా 7 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరాను అందించారు. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. వైఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ, బ్లూటూత్ వీ5.0 సపోర్ట్ కూడా ఉన్నాయి.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 125 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైంను అందించనున్నాయి. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 204 గ్రాములుగా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించనున్నారు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?