నథింగ్ ఫోన్ 1 మొబైల్ మనదేశంలో లాంచ్ అయినప్పుడు దాని డిజైన్ ఎంతో మందిని ఆకట్టుకుంది. కొంతమంది పాజిటివ్‌గా కామెంట్ చేశారు. కొందరికి అస్సలు నచ్చలేదు. కానీ మార్కెట్లో తన మార్కును నథింగ్ చూపించింది. ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 కూడా లాంచ్ అయింది. ఈ ఫోన్ కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధరను రూ.44,999గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు నథింగ్ ఫోన్ 2కు కాపీగా ఒక ఫోన్ మార్కెట్లోకి రానుంది.


ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. దీని డిజైన్ చూడటానికి నథింగ్ ఫోన్ల తరహాలోనే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ ఫోన్‌ను నథింగ్‌కు తమ్ముడు అని పిలుస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. దీన్ని బట్టి నథింగ్ ఫోన్ డిజైన్‌ను వీరు కాపీ కొట్టారని అర్థం చేసుకోవచ్చు.


ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ శర్మ దీనికి సంబంధించిన ఫీచర్లను లీక్ చేశారు. ఈ వార్తల ప్రకారం... ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.


దీన్ని వెనకవైపు నుంచి చూస్తే డిజైన్ కొంచెం నథింగ్ తరహాలో ఉంటుంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి మిగతా వివరాలు తెలియరాలేదు.


ఈ డిజైన్‌పై నథింగ్ సీఈవో కార్ల్ పెయ్ కూడా స్పందించాడు. తమ లాయర్లతో సిద్ధంగా ఉంటామని ట్వీట్ చేశాడు. ఫోన్ వెనకవైపు డిజైన్‌కు కూడా తాము పేమెంట్ చేయించినట్లు మరో యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు.










ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. ఏకంగా 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గా నిర్ణయించారు. 


ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ పని చేయనుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 580 నిట్స్‌గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్‌ను అందించారు. 


మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఉంది. దీన్ని మెమ్‌ఫ్యూజన్ ర్యామ్ ఫీచర్ ద్వారా 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీంతోపాటు 128 జీబీ స్టోరేజ్ కూడా అందించారు. 1 టీబీ వరకు ఎస్‌డీ కార్డును ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ సపోర్ట్ చేయనుంది.


Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial