iPhone 16 Discount Price: యాపిల్ కంపెనీ తన iPhone 16 ఫోన్ల ధరను భారీగా తగ్గించింది. దీంతో ఈ మోడల్ మునుపెన్నడూ లేనంత చౌకగా మారింది. యాపిల్ కంపెనీ Amazonతో కలిసి ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాష్‌బ్యాక్ డీల్స్‌ను అందిస్తోంది, దీనివల్ల వినియోగదారులు వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. Appleకి చెందిన శక్తివంతమైన A18 బయోనిక్ చిప్‌సెట్, అద్భుతమైన కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

Continues below advertisement

తగ్గిన ఐఫోన్ 16 ధర

iPhone 17 సెప్టెంబర్ నెలలో లాంచ్ చేశాక iPhone 16 ధర దాదాపు 10,000 రూపాయలు తగ్గింది. దీని ప్రారంభ ధర ప్రస్తుతం 79,900 రూపాయల నుండి రూ.69,900 కు తగ్గింది. అదే సమయంలో,Amazonలో ఈ ఫోన్ రూ.66,900కు లిస్ట్ చేశారు. దీనిపై అదనంగా 3,000 రూపాయల తగ్గింపు ఉంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్ కింద రూ.4,000 వరకు తగ్గింపు, 2,007 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ అన్ని ఆఫర్‌లను కలిపి కస్టమర్‌లు మొత్తం రూ.19,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత చౌకగా

మీరు పాత ఐఫోన్16 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో రూ. 44,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ విలువ మీ పాత ఫోన్ బ్రాండ్, కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు సగటున 10,000 రూపాయల ఎక్స్ఛేంజ్ లభిస్తే, మీరు iPhone 16ని దాదాపు 50,893 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Continues below advertisement

అద్భుతమైన ఫీచర్లు, కెమెరా

iPhone 16 స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల Super Retina XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది Appleకు చెందిన కొత్త A18 బయోనిక్ ప్రాసెసర్, USB Type C ఛార్జింగ్ పోర్ట్, IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. ఇది 48MP మెయిన్ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.  ముందు భాగంలో 12 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ నలుపు, తెలుపు, గులాబీ, టీల్, అల్ట్రామెరిన్ వంటి అనేక రంగులలో లభిస్తుంది.

Samsung Galaxy S24 Ultra పై కూడా భారీ తగ్గింపు

Amazonలో శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy S24 Ultra)పై కూడా భారీ తగ్గింపు నడుస్తోంది. ఇక్కడ ఈ ఫోన్ 12+256GB వేరియంట్‌ను కేవలం రూ.84,999 కు లిస్ట్ చేశారు. అయితే ఐఫోన్ 16 అసలు ధర రూ.1,34,999గా ఉంది. దీనితో పాటు ఈ ఫోన్‌పై మీరు బ్యాంక్ ఆఫర్‌లను కూడా చూడవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాంతో మీరు ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Also Read: