హువావే మేట్ 50 సిరీస్‌లో అద్భుతమైన ఫీచర్ ఒకటి ఉండనుందని వార్తలు వస్తున్నాయి. బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయినా సరే కాల్స్, మెసేజ్‌లు చేసుకునే అవకాశం ఈ ఫోన్‌లో ఉండనుందని సమాచారం. హువావే ఆపరేటింగ్ సిస్టం అయిన హార్మొనీఎస్ 3.0లో ఈ ఫీచర్ అందించనున్నారని తెలుస్తోంది.


ఈ స్మార్ట్ ఫోన్లలో ఎమర్జెన్సీ బ్యాటరీ ఫీచర్ ఉండనుంది. కేవలం కాల్స్, మెసేజెస్ మాత్రమే కాకుండా డాక్యుమెంట్లు స్కాన్ చేయడం లేదా లొకేషన్ కోడ్స్ పంపడం కూడా డెడ్ అయిపోయిన బ్యాటరీతో సాధ్యమే. హువావే మేట్ 50 సిరీస్ కూడా త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ మల్టీపుల్ సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో ఇప్పటికే కనిపించింది.


చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వీబోలో ఈ ఫీచర్ గురించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ షేర్ చేశారు. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినా ఫోన్‌కు పవర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియరాలేదు. బ్యాటరీ డెడ్ అయినప్పుడు మాత్రమే ఉపయోగపడేలా కొన్ని బ్యాటరీ సెల్స్‌ను ఇందులో అందించనున్నారని టిప్‌స్టర్ పేర్కొన్నారు.


హువావే మేట్ 50 సిరీస్‌లో హువావే మేట్ 50, హువావే మేట్ 50 ప్రో, హువావే మేట్ 50 ఆర్ఎస్ ఉండనున్నాయని తెలుస్తుంది. కిరిన్ 9000ఎస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. హార్మొనీఓఎస్ 3.0 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించే అవకాశం ఉంది.


హువావే పీ50ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,088 యువాన్లుగా (సుమారు రూ.48,900) నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,488 యువాన్లుగా (సుమారు రూ.53,600) ఉంది.


ఆబ్సీడియన్ బ్లాక్, కోకో గోల్డ్, స్నో వైట్, గెలాక్సీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ 4జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4100 ఎంఏహెచ్ కాగా... 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!