హానర్ 70 5జీ స్మార్ట్ ఫోన్ మలేషియాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. కర్వ్‌డ్ డిస్‌ప్లేను కంపెనీ హానర్ 70 5జీలో అందించింది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 54 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఇందులో ప్రధాన కెమెరాగా అందించారు.


హానర్ 70 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 1,999 మలేషియన్ రింగెట్లుగా (సుమారు రూ.35,600) నిర్ణయించారు. మలేషియా ఈ-కామర్స్ సైట్ లజాడా, షాపీల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్రిస్టల్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.


హానర్ 70 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డ్యూయల్ సిమ్ స్లాట్లను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై హానర్ 70 5జీ పనిచేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 178 గ్రాములు మాత్రమే.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 54 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్800 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు యాంబియంట్ లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేన్ అన్‌లాక్ ఫీచర్లను సెక్యూరిటీ కోసం అందించారు.


హానర్ ఒకప్పుడు మనదేశంలో కూడా యాక్టివ్‌గా ఫోన్స్ లాంచ్ చేసింది. అయితే సేల్స్ తగ్గడం, గూగుల్ విషయంలో సమస్యలు ఎదురు కావడంతో మనదేశంలో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయడం లేదు.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!